అచ్యుతాపురం తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన జనార్ధన్ రావు మంగళవారం సాయంత్రం అచ్యుతాపురంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తాహసిల్దార్ కు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి పనులను చేసి పెట్టాలన్నారు.