అధికారులు అందరూ సమన్వయంతో నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో డ్రైనేజీలు, రహదారులు తదితర సమస్యలపై అధికారులు సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.