అచ్యుతాపురం ఎస్ఈజెడ్లోని ఎసెన్సియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన యల్లబిల్లి చిన్నారావు కుటుంబానికి గురువారం ఎలమంచిలి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు రూ. కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ. ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామంలో బాధిత కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.