అచ్యుతాపురం నుండి అనకాపల్లి రోడ్డు విస్తరణ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాలు తరుపున రోడ్డు విస్తరణ సంక్షేమ సంఘం కార్యదర్శి ఆర్. రాము ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి ఆర్డీవోకి వినతిపత్రం అందచేశారు. 100 అడుగుల రోడ్డు విస్తరణకు భూములు కోల్పోయిన బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.