విశాఖ: తీవ్ర తుఫానుగా దానా
వాయ్యువ్య బంగాళాఖాతంలో ‘దానా తీవ్ర తుఫానుగా మారింది. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు 260 కిలోమీటర్లు, ధమ్రా (ఒడిశా)కు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే ఒడిశాలో తీవ్ర ప్రభావం చూపుతోందని విశాఖ వాతావరణ కేంద్రం గురువారం రాత్రి తెలిపింది.