జిల్లా పరిషత్ ఛైర్పర్శన్ సుభద్ర అధ్యక్షతన స్థానిక ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో గురువారం సర్వసభ్య సమావేశం జరగనుందని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సర్వసభ్య సమావేశం ఉదయం 10. 30 గంటల నుంచి సమావేశ మందిరంలో జరుగుతుంది.