విశాఖలోని గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిధి విభాగాన్ని ఎమ్మెల్యే గణబాబు మంగళవారం అధికారులతో కలసి ప్రారంభించారు. అనంతరం ప్రసూతి విభాగ గదులను సందర్శించి, అందుతున్న వైద్యసేవలపై గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జివిఎంసి జోనల్ కమిషనర్ హేమావతి ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో సమీక్షసమావేశం నిర్వహించి, ఆసుపత్రిలో మౌలిక వసతులు, ఇతర సమస్యలపై చర్చించారు.