విశాఖజీవీఎంసీలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో వెంటనే పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ కి సంబంధించిన ప్రజా ఫిర్యాదులు, కోర్టు కేసులు, ఆడిట్ అభ్యంతరాలు, ఈ -ఆఫీస్ అమలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకముందు అర్జీలను ఆయన స్వీకరించారు.