బంగాళాఖాతంలో ఆవర్తన కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఉత్తరాంధ్రలో ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.