స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వృద్ధుల కోసం..ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించింది. వివేకానంద అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో పాటు స్థానికంగా ఉన్న నిరుపేద వృద్ధులకు కూడా బిపి, షుగరు, ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు..వైద్య పరీక్షల అనంతరం వారందరికీ నెల రోజులకు సరిపడా మందులను ఫౌండేషన్ వైద్యులు ఉచితంగా అందజేశారు. బీపి, సుగరు ఉన్నవారు ప్రతీ నెల తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సూర్య తేజ సూచించారు. షుగరు ఉన్నవారు మందుల వాడకం మధ్యలో నిలిపి వేయడం మంచిది కాదని హితవు పలికారు. సుమతి, పి.వి. రావు పుండరీకాక్షయ్య తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలందించారు.