ఎల్‌జీ పాలిమర్స్ బాధితులకు అదనపు పరిహారం ఇచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు విశాఖ కలెక్టరేట్‌లో కంపెనీ ప్రతినిధులు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎంపీ భరత్, ఇతర ప్రజాప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్‌లో భేటీ అయ్యారు. తొలివిడత రూ. 60 కోట్లు ఇవ్వనున్నట్టు కెంపీ హెచ్‌ఆర్ పాల్ వెల్లడించారు. రెండో విడతలో దీర్ఘకాల సహకారం కోసం మరో రూ60 కోట్లతో ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.