ఐసీడీఎస్ సేవల్లో గణనీయమైన పురోగతి సాధించాలని బాలికల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంగళవారం ఐసీడీఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. టేక్ హోం రేషను పక్కాగా పంపిణీ చేయాలని సూచించారు. అనాధ పిల్లలు ఉంటే తగిన చర్యలు చేపట్టి బాలల సదనంలో చేర్పించాలన్నారు. బలహీనంగా ఉన్న చిన్నారులకు అదనపు పోషకాహారం అందించాలన్నారు. చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీలకు తీసుకుని రావాలన్నారు.