పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు, విద్యార్థులు చదువుకోడానికి ఎంతో అనుకూలంగా ద్వారకానగర్‌లోని విశాఖలోని పౌరగ్రంథాలయం ఉందని ప్రిన్సిపల్ కమిషనర్ కస్టమ్స్ ఎన్. సురేంద్ర అన్నారు. శుక్రవారం పౌర గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయంలోని వివిధ విభాగాలను గురించి, గ్రంథాలయ కార్యదర్శి వర్మ వివరించారు. సురేంద్ర మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు పౌరగ్రంథాలయం అనువైన వేదికలా ఉందన్నారు.