రాష్ట్రంలో బిజెపి చేపట్టిన సభ్యత్వ నమోదులో అనకాపల్లి జిల్లా ముందుండే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అనకాపల్లి ఎం పి, సి ఎం రమేష్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం మాడుగులలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అనంతరంజరిగిన సమావేశంలో మాట్లాడుతూ మొన్నటిఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎలా అయితే తనను గెలిపించారో అలానే సభ్యత్వ నమోదులో జిల్లాని అగ్ర స్థానంలో నిలబెట్టాలనికోరారు.