మాడుగుల గ్రామంలో విజయదశమి ఉత్సవాలు శనివారం రాత్రి తో ముగిసాయి. ఈనెల మూడో తేదీన ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవి ఆడిటోరియం, దుర్గలమ్మ ఆలయంలోనూ ఈ ఉత్సవాలు ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. రాత్రి గ్రామంలో ప్రత్యేక రథంలో అమ్మవారి తిరుపతి కోలాటాలతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.