భగత్ సింగ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విశాఖలోని ఏయూలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 80 మంది ఏయూ విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్ జె నాయుడు మాట్లాడుతూ. మనం ఇచ్చే రక్తం అత్యవసర సమయాల్లో ఇతరుల ప్రాణాలను కాపాడుతుందన్నారు.