చోడవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కే కోటపాడు మండలం కొరువాడ తుమ్మచెరువు పరిసర ప్రాంతంలో నాటు సారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 1600 లీటర్ల పులిసిన బెల్లపు ఉటను చోడవరం ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ సారా బట్టీలను అన్నింటిని కొరువాడ గ్రామానికి చెందిన కక్కల రాముకు సంబంధించినదిగా తెలుస్తుందని ఎక్సైజ్ సీఐ కెవి పాపు నాయుడు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.