తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సచివాలయ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీలు ధర్నాలు నిర్వహించారు. ముఖ్యంగా మెటర్నిటీ లీవ్ ను డెలివరీ తేదీ నుంచి కాకుండా అప్లై చేసినట్టు నుంచి అమలు చేయాలని, మెడికల్ ఆఫీసర్స్ అటెండెన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చే క్రమంలో బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని, హెల్త్ సెక్రటరీలకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలని కోరారు.