బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యంలో బిజెపి బృందం అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వరి పంటలు పూర్తిగా నీట మునిగాయని ఈ ప్రాంత రైతుల కు తక్షనమే నష్టపరిహారాన్ని చెల్లించి ఈ ప్రాంతంలో రైతులు ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.