మండలం లోని గోకులపాడు గ్రామంలో ఆదివారం నాడు రైతులు మరియు డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రకృతి వ్యవసాయం యొక్క లాభాల పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎం. టి రామగోవింద్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట అధిక దిగుబడి వచ్చి అధిక లాభాలను పొందవచ్చని సుమారు 18 నుండి 30 రకాల విత్తనాలను కలిపి పంట వేయడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, రైతులతో నవధాన్యాలు సాగు నేల తల్లి బాగు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రి సత్యనారాయణ , ఎల్ 1 నాగ గోవిందు, ఎల్. 1 రాము ( ఐ సి ఆర్ పి), వి. కనకరావు, ఏ. కాసులు, డి నందిని ,ఎస్. లావణ్య, ఏ అనురాధ, రైతులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.