దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ప్రతీ సంవత్సరం నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా ఆదివారం కోటఉరట్ల మండలం, రామచంద్రపురం గ్రామంలో భోనాల జాతర నిర్వహించారు. భక్తులు భోనాలు ఎత్తుకుని ఊరంతా తిరుగుతూ అమ్మవారి వద్దకు చేరుకొని భోనాలులో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. గ్రామం అంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్దిస్తారు. తర్వాత ప్రసాదాన్ని ప్రజలందరికి పంచుతారు. రాత్రికి పడిపూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టు గురు భవానీ గొర్లి సన్యాసిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెవ్వాకుల కుమారి, వైస్ సర్పంచ్ గెంజి సోమేశ్వరరావు, ఉగ్గిన ఈశ్వరరావు, ఉగ్గిన కన్నబాబు బత్తుల రమణ, గెంజి శ్రీను, చెవ్వాకుల వెంకటరమణ, పైల లోవరాజు, సుంకర నాగేష్, పైల అయ్యారావు, గాలి శ్రీను, వినోద్ తదితరులు పాల్గున్నారు.