ఎస్. కోట స్థానిక శాఖ గ్రంధాలయంలో లైబ్రేరియన్ డి దామోదర్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు డిబేట్ పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత అనే అంశంపై విద్యార్థిలకు నిర్వహించిన డిబేట్ పోటీలలో స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.