కొత్తవలస మండలం బలిఘట్టంలో ఎం ఎస్ ఎం ఈ పార్క్ ఏర్పాటు చేయాలని శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఈ ప్రాంతంలో ఎం ఎస్ ఎం ఈ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం భూమి సేకరించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రతిపాదన అమలకు నోచుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.