తమ సమస్యలు పరిష్కరించాలని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులు శనివారం ఎల్ కోట ఎమ్మెల్యే స్వగృహంలో వినతి పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ ప్రజలకు ప్రథమ చికిత్స చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నామని తెలిపారు. 2008లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన 429 జీవోను కూటమి ప్రభుత్వం కొనసాగించే విధంగా చర్యలు చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.