ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులోని ఆమె నివాసం వద్ద ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.