మెంటాడ మండలం కంటు భుక్తవలస గ్రామంలో గురువారం స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ, ఎంపీడీఓ భానుమూర్తి, ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకట్రావు, సర్పంచ్ బంగారమ్మ, ఎంపీటీసీ చప్ప సూర్య కుమారి పాల్గొన్నారు.