అన్నదాత సుఖీభవతో రైతులకు మరింత మేలు జరుగుతుందని, ఇందుకు సరైన మార్గదర్శకాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మన్యం జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అన్న దాత సుఖీభవ పేరుతో త్వరలో మార్గదర్శకాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతుల జీవితాలు మెరుగుపడతాయని, మరింత ప్రోత్సాహం పొందుతారని వివరించారు.