గిరిజనులు, ప్రజలు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా బడిదేవరకొండ క్వారీ పనులు వెంటనే ఆపాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో గిరిజన సంఘం నాయకులు పి. రాముతో కలసి పత్రికా సమావేశం నిర్వహించారు. తవ్వకాలు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి గ్రానైట్ లీజు లైసెన్స్ రద్దు చేయాలన్నారు.