పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందర పార్వతీపురంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారసంస్థలు, దాతలు ముందుకురావాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార సంస్థలు, సంఘాలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇది మంచి జిల్లా, మంచి ఊరుగా పేరు ఉందని, దాన్ని నిలుపుకోవలసిన అవసరం అందరిపై ఉందన్నారు.