కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరిని ప్రభుత్వ విప్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మన్యం జిల్లా నేతలు సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సీఎం కార్యాలయానికి మంత్రి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జగదీశ్వరి వెళ్లి సీఎంకి పుష్పగుచ్చం అందించి కృతఙ్ఞతలు తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో టీడీపీకి విజయం అందించి పార్టీ కోసం కస్టపడి పనిచేసే వారికీ గుర్తింపు ఉంటుందని సీఎం అన్నారు.