మన్యం జిల్లాలో 49 ఆధార్ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 49 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని -ఆధార్ అప్డేషన్, పేర్లు, చిరునామా, పుట్టిన తేదీలు తదితర మార్పులు చేసుకోవచ్చని ఆయన అన్నారు. పుట్టిన తేది మార్పుకు నిర్ధిష్ట ధృవ పత్రం సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.