కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారుడికి శుక్రవారం గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం కొసగూడ గ్రామానికి చెందిన బిడ్డిక సంజీవరావు స్వగ్రామానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం నుంచి జారిపడి గాయాల పాలయ్యాడని తెలిపారు. స్థానికులు అతడిని సమీప భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.