బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం కూసుమురు గ్రామంలో బుధవారం ప్రభుత్వం ఉచిత ఇసుక రీచ్‌ను టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్ వెంకటనాయుడు, ఎన్. వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిడి మైన్స్ నరసింహరెడ్డి, ఉప తహసీల్దార్ సత్యనారాయణ, మండల వీఆర్వో సంఘ అధ్యక్షుడు నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.