తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ వీధిలో శుక్రవారం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేలా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీ నాటికే లబ్ధిదారులకు పింఛన్ ఇస్తున్నట్లు చెప్పారు.