సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి అరణియార్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో గురువారం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో నీటి విడుదల ఎక్కువ చేయనున్నట్లు ఏఈ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. పిచ్చాటూరు నుంచి సురుటుపల్లి వరకు అరుణానది పరివాహక ప్రాంతప్రాంతం గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.