సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులోని అరనీయార్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువ 5600 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో అరుణానది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా గురువారం శ్రీకాళహస్తి- పిచ్చాటూరు రోడ్డు మార్గాన్ని పిచ్చాటూరు తహశీల్దార్ రమేశ్ బాబు, ఎస్సై వెంకటేష్ మూసి వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజు, ఆస్ఐ సుధాకర్, వీఆర్ఎ ప్రియాంక, సర్వేయర్ కన్నయ్య పాల్గొన్నారు.