సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలంలో గురువారం భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి వీధులు జలమయం కాగా వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి. బైర్రాజు కండ్రిగ వద్ద ఒక్కసారిగా నీరు రావడంతో రాకపోకలు కాసేపు నిలిపివేసినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ కారణంగా మండలంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.