బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉండడంతో మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా మండలంలో ఈదులు గాలులు వీచాయి. మండల ప్రజలు చలికి వణికి పోతున్నారు. మండల రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.