బంగాళాఖాతంలో లేచిన వాయుగుండం కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుండి భారీ వర్షాలు పడుతున్నాయి దాని కారణంగానే కే వి బి పురం మండలం ఎంఏ రాజుల కండ్రిగ మరియు పూడి చెన్నకేశవపురం రోడ్డు మధ్య మార్గంలో కాజ్ వే తెగి వాగు పొంగిపొర్లుతున్నది. ఇలాగే భారీ వర్షాలు పడినప్పుడల్లా తెగి నాలుగు ఊర్లను ముప్పుతిప్పలు పెడుతున్నది. ఆ నాలుగు ఊర్లో వారు మాకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ అధికారులను గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.