చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని నక్కబండ ప్రాంతంలో విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న వెంకటమునిపై చర్యలు తీసుకోవాలని బుధవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ఆర్ ఎ, అతని కుటుంబ సభ్యులు పేద ప్రజల భూముల ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.