పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ది వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే మురళీమోహన్ ను ఈవో గురుప్రసాద్ ఆలయ అర్చకులతో కలిసి చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. వేద పండితులతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సెప్టెంబరు 7 నుండి 27వ తేదీ వరకు జరిగే శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.