చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు శుక్రవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. మొదట ఆరిమాకుల పల్లె పీ హెచ్ సి సెంటర్ని సందర్శించి, వైద్యుల నిర్లక్ష్యాన్ని, పారిశుధ్య లోపాన్ని తప్పుపట్టారు. వైద్యులు తమ తీరును మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయుష్మాన్ భవా ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి వైద్యులతో సమావేశమయ్యారు.