కుప్పం: ఆవుల యజమానులపై చర్యలు తీసుకోండి
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఆవులు, మేకలను విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని జనసేన నాయకులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు నేతాజీ రోడ్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా రెండు ఆవులు రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కావున ఆవులు యజమానులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపాలిటీ కమిషనర్ ని కుప్పం జనసేన పార్టీ తరపున కోరుతున్నామని మంజునాథ్ ,ప్రవీణ్ కుమార్ తెలిపారు.