మణిపూర్‌‌లో హింస.. అమిత్ షా అత్యున్నత సమీక్ష

79பார்த்தது
మణిపూర్‌‌లో హింస.. అమిత్ షా అత్యున్నత సమీక్ష
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆయన ఇవాళ మహారాష్ట్రలో పర్యటించాల్సి ఉండగా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி