కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు షికారి కాలనీలో వార్డు పార్టీ ఇంచార్జ్ రవి ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే కార్యకర్తల బాగోగులు పట్టించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కొరకు ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేసిన ఘనత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కె దక్కుతుందన్నారు.