తెలంగాణ 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'రూ. 50వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. 10 నెలలు కాకుండానే మా ప్రభుత్వంపై కొందరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని రూపుమాపీలా కాంగ్రెస్ శ్రేణులు సంఘటితం కావాలి' అని మంత్రి పిలుపునిచ్చారు.