కుప్పంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులకు పది నెలలుగా జీతాలు రావడం లేదని శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో, ఎంఈవో, అక్షయపాత్ర కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. రెండేళ్లుగా కోడిగుడ్లు ఉడకబెట్టడానికి, గంజి కాయడానికి ఉపయోగించిన గ్యాస్ బిల్లులను కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.