శాంతిపురం మండలంలోని కడపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. కడపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్న విమర్శల నేపథ్యంలో ఆదివారం వేకువజామున అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే జైలుకు పంపుతామని అధికారులు స్పష్టం చేశారు.