చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో 7 నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు గురజాల
జగన్ మోహన్, మురళీ మోహన్ శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సంస్థలను, సంస్థ ఆస్తులను నిర్వీర్యం చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేశారని ఇది పేదల ప్రభుత్వమని త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.