తిరుచానూరు: తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి దేవి

71பார்த்தது
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారిని తిరుచ్చిపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు.

தொடர்புடைய செய்தி